రానున్న ఐదు సంవత్సరాల్లో ఉద్యోగాల తీరులో చాలా మార్పులు ఉంటాయని ఓ నివేదిక స్పష్టం చేసింది. మొత్తం నికర ఉద్యోగాల సృష్టిలో తగ్గుదల నమోదవుతుందని పేర్కొంది. ఈ దశాబ్దం ఆరంభంలోనే ఉద్యోగాల కల్పనకు కరోనా, ఆటోమేషన్ రూపంలో గట్టి సవాళ్లు ఎదురయ్యాయి. దీని వల్ల ఉద్యోగాల తీరులోనూ మార్పులు వేగంగా జరిగాయి. రానున్న ఐదు సంవత్సరాల్లో దాదాపు 23 శాతం ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుఉంటాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) నివేదిక అంచనా వేసింది. 2023 నుంచి 2027 రకు 6.9 కోట్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో 8.3 కోట్లు కనుమరుగవుతాయని నివేదిక అంచనా వేసింది. ఈ మేరకు భవిష్యత్ ఉద్యోగాల తీరుతెన్నులపై ప్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2023 పేరిట డబ్ల్యూఈఎఫ్ ఒక వివరమైన నివేదికను ఆదివారం నాడు విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 803 కంపెనీల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ విషయాలను నివేదికలో పొందుపరి చింది.
హరిత ఇంధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, సప్లయ్ చైయిన్ లోకలైజేషన్, పర్యావరణ, సామాజిక, పాలనాపరమైన అంశాల్లో ప్రామాణికత ఉద్యోగాల సృష్టికి దోహదం చేస్తుందని నివేదిక తెలిపింది. అదే సమయంలో ద్రవ్యోల్బణం, ఆర్ధిక వృద్ధిలో మందకొడితనం, సరఫరా కొరతలు సవాల్ విసురుతాయని పేర్కొంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అమలు, డిజిటలీకరణ వల్ల ఉద్యోగాల తీరులో గణనీయమైన మార్పులు రానున్నట్లు అంచనా వేసింది. మొత్తంగా ఆధునాతన సాంకేతికత వల్ల దీర్ఘకాలంలో ఉద్యోగాల కల్పన మెరుగుపడుతుందని తెలిపింది.
నివేదికలో ముఖ్య అంశాలు…
రానున్న ఐదు సంవత్సరాల్లో వ్యాపారాల్లో మార్పులు పూర్తిగా కొత్త టెక్నాలజీ అమలుపైనే ఆధారపడి ఉంటాయని తెలిపింది. పర్యావరణ, సాంకేతికత, ఆర్ధికంగా వచ్చే కొత్త పోకడలు ఉద్యోగాల సృష్టికి, అదే సమయంలోఉద్యోగ కోతలను కూడా నిర్ధేశిస్తాయని స్పష్టం చేసింది. రానున్న ఐదు సంవత్సరాల్లో 75 శాతం కంపెనీలు బిగ్‌డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేథ వంటి అత్యాధునిక సాంకేతికతలను అందిపుచ్చుకుంటాయి. కొత్త టెక్నాలజీ వల్ల వచ్చే ఐదు సంవత్సరాల్లో కొత్త ఉద్యోగాల కల్పన నికరగా పెరుగుతుందని నివేదిక తెలిపింది.
అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ నిపుణులకు రానున్న రోజుల్లో డిమాండ్ బాగా పెరుగుతుందని. దీని తరువాత సస్టయినబిలిటీ నిపుణులు, బిజినెస్ ఇంటెలిజెన్స్ విశ్లేషకులు, సమాచార భద్రత విశ్లేషకులు, పునరుత్పాదక ఇంధన ఇంజినీర్లు, సౌర ఇంధన స్థాపన, వ్యవస్థల ఇంజినీర్ల వంటి వారికి డిమాండ్ పెరుగుతుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వెలువరించిన నివేదికలో పేర్కొంది.
క్లర్కు జాబ్‌లు, సెక్రటోలియల్ జాబ్స్లోఉన్న వారికి రానున్న సంవత్సరాల్లో అవకాశాలు తగ్గిపోతాయి. బ్యాంక్ టెల్లర్లు సంబంధిత క్లర్కులు, పోస్టల్ సేవల క్లర్కులు, క్యాషియర్లు, టికెట్ క్లర్కులు, డేటా ఎంట్రీ క్లర్కు ఉద్యోగాలు ఒక ముందు కనిపించవని నివేదిక తెలిపింది. ఆటోమేషన్ మూలంగా ఈ ఉద్యోగాలు ఒక ముందు ఉండవని పేర్కొంది. విద్యా రంగం, వ్యవసాయం, డిజిటల్ కామర్స్, వాణిజ్య రంగాల్లో ఉద్యోగాలు కూడా తగ్గుతాయని పేర్కంది. విశ్లేషణాత్మక, సృజనాత్మక ఆలోచన విధానం కీలక నైపుణ ్యంగా మారనుందని అంచనా వేసింది.
వచ్చే ఐదు సంవత్సరాల్లో 44 శాతం మంది ఉద్యోగుల నైపుణ్యాలకు కాలం చెల్లనుందని యాజమాన్యాలు వెల్లడించాయి. 2027 నాటికి ప్రతి 10 మంది కార్మికుల్లో ఆరుగురికి నైపుణ్య శిక్షణ అవసరమవుతుందని యాజమాన్యాలు పేర్కొన్నాయి. అయితే సగం మంది మాత్రమే సరైన నైపుణ్యాలను అందిపుచ్చుకునేందుకు అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.