Saturday, November 23, 2024

తెలంగాణ బ‌డ్జెట్ కూర్పు మొద‌లు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: 2023-24 వార్షిక బడ్జెట్‌ కూర్పు మొదలైంది. ఆర్థిక శాఖ ఈ మేరకు అన్ని శాఖలకు వివ రాలు కోరుతూ ఆదేశాలు జారీ చేసింది. గతేడాది ఆదాయాలు, వ్యయాలు, అంచనాలను అధికారులు సమగ్ర వివరాలతో ఆర్థిక శాఖకు అందజేయాలని పేర్కొంటూ జీవో జారీ చేసింది. మూస విధానంలో కాకుండా సహేతుక పద్ధతిలో వివరాలను పంపించాలని కోరింది. ఆన్‌లైన్‌లో ప్రతిపాదనలు అందిం చాలని పేర్కొంది. రానున్న ఆర్థిక సంవత్సరం(2023-24)లో ఆయా శాఖలలో అమలు చేసే కార్యక్రమాలు, పథకాలు, నిర్వ హణ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదనలు ఇవ్వా లన్న ఆర్థిక శాఖ అంచనాలు వాస్తవికతతో కూడి ఉండాలని, ఊహాజనిత, సాంప్రదాయ పద్దతిలో వివరాలు ఉండరాదని స్పష్టం చేసింది. ఇప్పటికే కేటాయించిన పోస్టుల్లో 2023-24 లో కొత్తగా చేరే ఉద్యోగుల సంఖ్య, ఖాళీల వివరాలను నిర్దేశిత నమూనాలో అందించాలని సూచించింది. అన్ని శాఖల వద్ద ఉన్న బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సమగ్ర వివరాలి వ్వాలని తెలిపింది. అన్ని వివరాలతో కూడిన ప్రతిపాదనలు ఆన్‌లైన్‌లో ఈ నెల 12 వరకు సచివాలయంలోని సంబంధిత శాఖలకు అందించాలని ఆర్థికశాఖ పేర్కొంది. సచివాలయం లోని సదరు శాఖల పాలన యంత్రాంగం ఆ ప్రతిపాదనలను పరిశీలించి తమ అభిప్రాయాలను పొందుపరిచి 13 లోగా ఆర్థికశాఖకు అందించాలని స్పష్టం చేసింది. శాఖలన్నీ తమ పరిధిలో రెవిన్యూ రాబడులు పెంచుకునే అంశంపై దృష్టిపెట్టా లని, ఎక్కడా లీకేజీలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ సూచించింది. అన్ని స్థాయిల ఉద్యోగుల పనితీరు మెరుగుపడేలా వ్యక్తిగత ప్రమాణాలను నిర్దేశించాలని పేర్కొంది.

రానున్న 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ కస రత్తును రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రారంభించింది. శుక్రవారంలోగా అన్నిశాఖల నుంచి ఆన్‌లైన్‌లో ప్రతిపాదనలు పంపాలని స్ప ష్టం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆయా శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలతోపాటు 2022-23కు సవ రించిన ప్రతిపాదనలను సమర్పించాలని పేర్కొంది. డిసెంబర్‌ వరకు చేయాల్సిన చెల్లింపుల వివరాలను ఇవ్వాలని అన్ని శాఖలకు ఆర్థికశాఖ స్పష్టం చేసింది. అన్నిశాఖలు రాబడులు పెంచుకునే అంశంపై దృష్టి సారించడం సహా కింది స్థాయి నుంచి పైస్థాయివరకు ఎక్కడా లీకేజీ లేకుండా, ఉద్యోగుల పనితీరు మెరుగుపడేలా ప్రమాణాలు నిర్దేశించాలని పేర్కొంది. రాష్ట్ర రాబడులను పెంచుకోవడంతోపాటు, ప్రభుత్వ పథ కాలకు నిధుల లోటు లేకుండా చర్యలకు ప్రాధాన్యతనివ్వాలని సర్య్కులర్‌లో వెల్లడించింది. శాఖల వారీగా అందిన వివ రాలను క్రోడీకరించిన తర్వాత వరుసగా ప్రి బడ్జెట్‌ సమావేశా లను నిర్వహించి పూర్తిస్థాయిలో ప్రతిపాదనలకు ఆమోదం తెలుపనున్నారు.

తాజాగా వచ్చే నెల 1న కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర సాయాలు, గ్రాంట్లు వెల్లడవడం జరగనుందని, అయితే ప్రస్తుత ఆర్థిక యేడాదిలో అంచనాలు, లక్ష్యం, వాస్తవంగా చేసిన ఖర్చులు, ఇంకా కావాల్సిన వ్యయాలు, సవరించిన ప్రతిపాదనలతో సమగ్ర వివరాలను ఆర్థిక శాఖ సేకరిస్తోంది. ఈ నేపథ్యంలోనే పూర్తి వివరాలతో 2023-24 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్‌ కోసం ప్రతిపాదనలు సమర్పించాలని అన్ని శాఖలకు ఆర్థిక శా ఖ తెలిపింది. వాటితోపాటు ప్రస్తుతం కొనసాగుతున్న 2022- 23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌కు సవరించిన ప్రతిపాదనలు ఇవ్వాలని తెలిపింది. సవరించిన ప్రతిపాదనల్లో కేటాయి ం పుల మొత్తాన్ని పెంచే అంశాన్ని అంగీకరించేది లేదని ఆర్థికశాఖ స్పష్టంచేసింది. మధ్యలో కొత ్తపథకాలు, కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ తేదీ వివరాలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అందుకయ్యే మొత్తం వ్యయం, సంబంధిత వివరాలు సమర్పి ంచాలని తెలిపింది. 2023-24లో పబ్లిక్‌వర్క్స్‌ పనులు చేసే అన్నిశాఖలు 2022 డిసెంబర్‌ వరకు చేయాల్సిన చెల్లింపు మొత్తాల వివరాలివ్వాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. వివరాలు అందించే క్రమంలో ఖచ్చితత్వం ఉండాలని పేర్కొంది. ఇంజ నీరింగ్‌ పనులకు చెందిన అన్ని ఒప్పందాల వివరాలు సమ ర్పించాలని సూచించింది. ప్రస్తుతం అమలులో ఉన్న పన్ను లు, ధరల ఆధారంగా వచ్చే ఆర్థిక సంవత్సరం ఆదాయాన్ని అంచనా వేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆర్థిక శాఖ సూచించింది. ఈ మేరకు శాఖల వారీగా ప్రతిపాదనలకు ఫార్మాట్‌ను జత చేసింది. ప్రభుత్వ పథకాలు, ఇంజనీరింగ్‌ పను లకు నిధుల వ్యయాలకు చెందిన యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు, అన్ని శాఖల్లో బ్యాంకు ఖాతాలు, పీడీ ఖాతాలు, మిగిలిపోయిన నిధుల వివరాలను పొందుపర్చాలని వెల్లడించింది.

కొత్త ఏడాదిలో మొదలవుతున్న బడ్జెట్‌లో ఎన్నికల ఏడాది కావడంతో సహజంగానే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమా లు, ప్రజారంజక బడ్జెట్‌గా అలరారేలా సర్కార్‌ చర్యలు తీసు కోనుంది. ఇప్పటికే 80శాతం బడ్జెట్‌ను సంక్షేమ, ప్రజాకర్షక పథకాలకే ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఈ ఏడాది మరిన్ని కొత్త పథ కాలతోపాటు, పాత పథకాలను కొనసాగించాల్సి రానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పలు పథకాలతొ పాటు అతి భారీ పథకాలుగా పేరున్న దళితబంధు, కొత్త ఇంటి పథకం, ఇతర పథకాలకు భారీగా కేటాయింపులు చేసే అవ కాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement