గుజరాత్‌లోని భుజ్ సెక్టార్లో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) పాకిస్థాన్‌కు చెందిన 22 మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకుంది. 79 ఫిషింగ్ బోట్లను సీజ్ చేసింది. గుజరాత్ బీఎస్ఎఫ్ 2022లో సాధించిన అచీవ్‌మెంట్స్‌కు సంబంధించి బీఎస్ఎఫ్ వెల్లడించిన ప్రకటనలో ఈ విషయాన్ని పేర్కొన్నారు.
రూ.250 కోట్ల విలువ చేసే 50 ప్యాకెట్ల హెరాయిన్‌ను, రూ.2.49 కోట్ల విలువచేసే 61 ప్యాకెట్ల చరాస్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ తన ప్రకటనలో తెలిపింది. ఇల్లిగల్ ట్రాన్స్బార్డర్ యాక్టివీటీస్లో ప్రమేయం ఉందన్న కారణంగా 22 మంది భారతీయులు, నలుగురు పాకిస్థానీలు, ఇద్దరు బంగ్లాదేశీయులు, ఇద్దరు కెనడియన్లు, ఒక రొహంగ్యాను కూడా అరెస్ట్ చేశారు.