గాజా: హమాస్-ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న దాడులలో ఇప్పటి వరకు విధినిర్వహణలో ఉన్న 22 మంది మృత్యు వాతపడ్డారు.. అక్టోబర్ 7వ తేదీ నుంచి జరుగుతున్న ఫైటింగ్లో 18 మంది పాలస్తీనియన్లు, ముగ్గురు ఇజ్రాయిలీలు, ఓ లెబనీస్ జర్నలిస్టు ఉన్నారు. సీపీజే (కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్) ఈ విషయాన్ని వెల్లడించింది. ఇజ్రాయిల్ చేసిన దాడుల వల్లే 15 మంది జర్నలిస్టులు మృతిచెందినట్లు సీపీజే పేర్కొన్నది. ఇక హమాస్ చేసిన దాడుల్లో ఇద్దరు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 8 మంది జర్నలిస్టులు గాయపడ్డారు. మరో ముగ్గురు ఆచూకీ తెలీయరాలేదు..
ఇది ఇలా ఉంటే ఇద్దరు అమెరికన్లను హమాస్ తీవ్రవాదులు నేడు వదిలివేశారు. మానవతా కోణంలో ఈ ఇద్దరిని విడుడల చేసినట్లు హమాస్ ఒక ప్రకటనలో తెలిపింది.. ఇక అమెరికా ప్రకటించిన సాయం నేపథ్యంలో ఈజిప్ట్ నేడు ఇజ్రాయిల్ తో ఉన్న సరిహద్దును తెరిపింది.. దీంతో వందలాది వాహనాలు ఇజ్రేయల్ లో ప్రవేశించాయి…