శ్రీవారి దర్శనానికి 22గంటల సమయం పడుతోంది. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండి శంఖుమిట్ట క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 75,407 మంది భక్తులు వెంకన్న స్వామిని దర్శించుకోగా 35,535 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.56 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.మరోవైపు సెప్టెంబర్ నెలకుగాను ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఉదయం 11 గంటలకు అధికారులు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
శ్రీవారి దర్శనానికి 22గంటల సమయం-తిరుమలలో భక్తుల రద్దీ
Advertisement
తాజా వార్తలు
Advertisement