Friday, November 1, 2024

TG | ములుగు గిరిజన యూనివర్సిటీకి 211 ఎకరాలు !

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ములుగు గిరిజన యూనివర్సిటీకీ అవసరమైన భూమిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమ్మక్క సారలక్క సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ పేరుతో ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ మేరకు గత నెల 14న ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ క్రమంలో గిరిజన యూనివర్సిటీకీ 211.26 ఎకరాలను కేటాయిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది.

ములుగు గ్రామంలోని సర్వే నెంబర్‌ 837లో 211 ఎకరాలను కేటాయించింది. ఈ భూమికి ఎకరాకు రూ.3,37,500 ధర ఉండగా, మొత్తం ధర రూ.10,58,31,250 కోట్లుగా తేల్చారు. ఈ మేరకు సదరు భూమిని కేటాయిస్తూ జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement