అంట్లాంటా : అమెరికాలో భారతీయ విద్యార్థులకు చుక్కెదురైంది. 21 మంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపించారు. పలు వర్సిటీల్లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులను సరైన పత్రాలు లేవనే కారణంతో అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపించారు. విద్యార్థుల మెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్లు చూసి తిప్పి పంపించినట్లు తెలుస్తోంది. అట్లాంటా, శాన్‌ఫ్రాన్సిస్కో, షికాగో నుంచి మొత్తంగా 21 మంది విద్యార్థులను ఎయిర్ ఇండియా విమానంలో తిప్పి భారత్‌కు పంపించారు.
వెనక్కి పంపిన వారిలో 16 మంది తెలుగు విద్యార్ధులున్నారు.. అమెరికా నుంచి ఒక్కసారి డిఫార్ట్ అయితే మరో అయిదేళ్ల వరకూ అక్కడి వెళ్లలేరు.. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా తిప్పి ఎందుకు పంపతున్నారో అంటూ విద్యార్ధుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. భారతీయ విదేశాంగ శాఖ అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వేడుకుంటున్నారు..