దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. వైరస్ చాపక్రింద నీరులా క్రమంగా వ్యాప్తి చెందుతుంది. కొవిడ్ కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. మాయాదారి మహమ్మారి పూర్తిగా అంతం కాలేదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. దేశంలో మరోసారి 20 వేలకు పైగా కొత్త కేసులొచ్చాయి. గత 24 గంటల్లో కొత్తగా 20,408 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
వైరస్ బారిన పడి 54 మంది చనిపోయారు. దేశంలో ప్రస్తుతం లక్షా 43 వేల 384 యాక్టివ్ కేసులున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 5.05 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం కేసుల్లో 0.33 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.48 శాతం ఉండగా మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని పేర్కొంది. ఇక ఇప్పటివరకు 203.94 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 33,87,173 మందికి వ్యాక్సిన్ అందజేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.