కొత్త సంవత్సరంలోనూ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు కఠినమైనదిగానే ఉంటుందని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా హెచ్చరించారు. సగం ప్రపంచం ఆర్ధిక మాంద్యం గుప్పిట్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. గ్లోబల్ ఎకనామికి ప్రధాన చోధకులుగా ఉన్న అమెరికా, యూరఫ్, చైనా ఆర్ధిక వ్యవస్థలు బలహీనపడటమే ఇందకు ప్రధాన కారణమని అమె అభిప్రాపయడ్డారు. గడిచిన సంవత్సరం కంటే నూతన సంవత్సరం మరింత క్లిష్టమైనది ఆమె వ్యాఖ్యానించారు. మూడు అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థలు ఒకేసారి నెమ్మదించడం వల్ల దాని ప్రభావం ప్రపంచ దేశాలపై ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్ధిక మాంద్యం లేని దేశాల్లోని ప్రజలు కూడా దీని ప్రభావానికి గురవుతారని అభిప్రాయపడ్డారు.
2023లో ప్రపంచ వృద్ధిరేటును అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) 2022 అక్టోబర్‌లోనే తగ్గించింది. 2021లో 6 శాతంగా ఉన్న వృద్ధి రేటును 2022లో 3.2 శాతంగా, 2023లో 2.7 శాతంగా ఉండనుందని పేర్కొంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండటం, ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రాకపోవడం, వరసగా అమెరికా ఫెడరల్ బ్యాంక్‌తో పాటు, ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంక్‌లు వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతుండటం వంటి కారణాల నేపథ్యంలో ఐఎంఎఫ్ గ్లోబల్ వృద్ధిరేటును తగ్గించింది. ద్రవ్యోల్బణం ఒత్తిడిలో వడ్డీరేట్లు పెంచుతున్నారని, దీని ప్రభావం ఆర్ధిక వ్యవస్థల వృద్ధిపై పడుతుందని ఐఎంఎఫ్ హెచ్చరించింది.
చైనా జీరో కొవిడ్ విధానానికి స్వస్తి చెప్పిన తరువాత అక్కడ కేసులు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే చైనా అధ్యక్షుడు జినిపింగ్ నూతన సంవత్సరం సందేశంలో చైనా కొత్త దశలోకి ప్రవేశించిందని చెప్పారు. చైనా ఆర్ధిక వ్యవస్థ గతంలో ఎన్నడూ లేనంత క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటోంది. 40 సంవత్సరాల్లో మొదటిసారి చైనా వృద్ధిరేటు గ్లోబల్ వృద్ధిరేటు కంటే తక్కువగా నమోదైందని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.
రానున్న నెలల్లో కొవిడ్ ప్రభావం ఆర్ధిక వ్యవస్థపై ఏ మేర ఉంటుందో చూడాల్సి ఉందని, దీని వల్ల ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుందని జార్జివా చెప్పారు. కొవిడ్ కేసులు పెరిగితే దాని ప్రభావం చైనా ఆర్ధిక వ్యవస్థపై వ్యతిరక ప్రభావం చూపిస్తుంది, దీని వల్ల ఈ రీజియన్‌పై ప్రభావం, గ్లోబల్ ఎకానమిపై నెగిటివ్ ప్రభావం పడుతుందన్నారు. 2022లో అక్టోబర్‌లో చైనా వృద్ధిరేటు 3.2 శాతం, 2023లో 4.4 శాతం ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ వృద్ధిరేటు తగ్గినప్పటికీ ఇది కొనసాగుతుందని పేర్కొంది. జనవరి చివరిలో దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం సమయంలో ఐఎంఎఫ్ మరోసారి ప్రపంచ ఆర్ధిక వృద్ధిపై తన అంచనాలను వెల్లడించనుంది.
అమరికా ఆర్ధిక వ్యవస్థ పరిస్థితి వేరుగా ఉందని ఆమె చెప్పారు. మూడొంతుల ప్రపంచాన్ని ఇది ప్రభావితం చేస్తుందన్నారు. అమెరికా ఆర్ధిక వ్యవస్థ త్వరగా కొలుకునే స్వాభవం కలిగి ఉందన్నారు. అమెరికాలో మాంద్యాన్ని నివారించవచ్చని, లేబర్ మార్కెట్ చాలా బలంగా ఉందన్నారు. కాని వాస్తవంలో అది తీసుకుంటున్న చర్యల మూలంగానే సమస్య వస్తుందని అభిప్రాయపడ్డారు. అమెరికాలో 2 శాతం కంటే దిగువకు ద్రవ్యోల్బణాన్ని తీసుకు రావాలన్న ఫెడరల్ బ్యాంక్ లక్ష్యం కంటే ప్రస్తుతం మూడు రేట్లు అధికంగా ఉందన్నారు. లేబర్ మార్కెట్ స్ట్రాంగ్‌గా ఉన్నందున ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్లను మరింత కఠినంగా అమలు చేయాల్సి ఉంటుందన్నారు. అమెరికా జాబ్ మార్కెట్‌పై ప్రధానంగా ఫెడ్ అధికారులు దృష్టి సారిస్తాఆరు.
ద్రవ్యోల్బణం తగ్గాలంటే లేబర్ మార్కెట్ డిమాండ్ తగ్గాలని కోరుకుంటారని చెప్పారు. ప్రస్తుతం అమెరికాలో నిరుద్యోగ రేటు 3.7 శాతం ఉంది. అమెరికా, చైనా, యూరప్ ఆర్ధిక వ్యవస్థ పనితీరు ఆధారంగానే కొత్త సంవత్సరంలో ప్రపంచ ఆర్దిక
వ్యవస్థ పనితీరు ఆధారపడి ఉంటుందని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. 2023 సంవత్సరం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు నల్లేరుపై నడక మాత్రం కాదని అభిప్రాయపడింది. అమెరికాలో ఇప్పటికే ఆర్ధిక మాంద్యం భయాలతో అనేక టెక్ కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులకు తొలగిస్తున్నాయి. ధరల పెరుగుదలతో డిసెంబర్‌లో స్వల్ప ఊరట లభించినప్పటికీ, ఆర్ధిక వ్యవస్థ కోలుకోవడానికి అది సరిపోదని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా ఆర్ధిక వ్యవస్థ పనితీరు ఆసియా ఖండంలోని దేశాలపై ప్రత్యక్షంగా, పరోక్ష్యంగా పడనుంది.