Friday, November 22, 2024

200 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

సంగారెడ్డి జిల్లా భారీగా రేష‌న్ బియ్యం ప‌ట్టుబ‌డ్డాయి. ప్ర‌భుత్వాలు నిరుపేద‌ల కోసం అందిస్తున్న రేష‌న్ బియ్యం కొంద‌రు అక్ర‌మార్కులు ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నారు. స్థానికుల నుంచి కొందరు రేషన్‌ బియ్యాన్ని సేకరించి ఇతర రాష్ట్రాలకు అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా కోహీర్ రైల్వే గేటు సమీపంలో తాండూర్ నుంచి మహారాష్ట్ర వెళ్తున్న లారీని అధికారులు తనిఖీ చేశారు. అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్‌ బియ్యాన్ని పోలీసులు, పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. రెండు వందల క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎవ‌రి దీనికి సూత్ర‌దారులు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. లారీ డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సురేశ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement