Saturday, November 23, 2024

హిందూ మహాసముద్రంలో 200 చైనా బోట్లు..

ఈ ఏడాది తొలి నాళ్లలో దాదాపు 200చేపల వేట పడవలు చైనా నుంచి హిందూ మహాసముద్రంలోకి వచ్చినట్లు భారత నావికాదళం తెలిపింది. ఈ నౌకలు చట్టవిరుద్ధంగా, ఎలాంటి సమాచారం లేకుండా ప్రవేశించాయని వెల్లడించింది. భారత ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌ సమీపంలో ఈ బోట్లు చేపల వేట కొనసాగిస్తున్నాయని పేర్కొంది. చైనా నౌకలతోపాటు మరికొన్ని ఐరోపా దేశాల నౌకలు సైతం హిందూ మహాసముద్రంలో చేపల వేట నిర్వహిస్తున్నాయని నావికాదళం తెలిపింది. ఇటీవల కాలంలో డీప్‌సీ ఫిషింగ్‌ ట్రాలెర్లు, ఇతర పడవల కారణంగా హిందూ మహాసముద్రంలో చైనా పడవల కదలికలు పెరిగాయి.

- Advertisement -

చైనా తీరానికి దూరంగా డీప్‌సీ ఫిషింగ్‌ ట్రాలెర్లు ఇక్కడికి రావడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సముద్ర గర్భం పరిస్థితులపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. 2015 నుంచి 2019 మధ్య 500 చైనా డీప్‌సీ ట్రాలెర్లు ఇక్కడకు వచ్చినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement