సినీ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని గంగోత్రి చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు అల్లు అర్జున్.ఫస్ట్ చిత్రంలో ఈయన లుక్ చూసి ఎగతాళి చేసినవారు ఎంతోమంది. అయితే విమర్శలన్నింటినీ పాజిటీవ్ గా తీసుకుని అంచెలంచెలుగా ఎదిగాడు బన్నీ. కాగా గంగోత్రి చిత్రం 28, 2003లో విడుదలైన సంగతి తెలిసిందే. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా నటుడిగానూ ప్రశంసలు అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా.. అల్లు రామలింగయ్య మనవడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బన్నీ.. నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆర్య, బన్ని, హ్యాపీ, దేశముదురు, పరుగు, ఆర్య 2 ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించారు. సినిమా సినిమాకు తనని తాను మెరుగు పరుచుకుంటూ నటనతో పాటు డాన్సుల్లోనూ తనదైన గ్రేస్‌ను క్రియేట్ చేసుకున్నాడు ఈ హీరో.
తననను విమర్శలు చేసిన వాళ్లే ఇప్పుడు స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అని అప్రిషియేట్ చేస్తున్నారు. ఆయన సినీ ప్రయాణానికి అక్షరాలా 20 ఏళ్లు. ఇంత దూరం.. ఇంత కాలం.. తనని తాను చెక్కుకుంటూ శిల్పిలా అల్లు అర్జున్ ఈ స్థాయికి చేరుకున్నారనటంలో అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో ఆయన తన రెండు దశాబ్దాల ప్రయాణం గురించి ఓ భావోద్వేగ లేఖను రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అల్లు అర్జున్. సినీ రంగంలో మార్చి28తో నేను 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. నాపై చూపించిన ప్రేమ చూస్తే నేనెంతో అదృష్టవంతుడిని. సినీ ఇండస్ట్రీలోని నా సన్నిహితులకు ధన్యవాదాలు. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే కారణం ప్రేక్షకులు, అభిమానులు, నన్నెంతగానో ఇష్టపడేవారు చూపించిన ప్రేమ. మీకెప్పటికీ కృతజ్ఞతలతో ఉంటాను అని తెలిపారు అల్లు అర్జున్. బన్నీ పోస్ట్‌పై సమంత, లక్ష్మీ మంచు సహా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు రియాక్ట్ అవుతున్నారు. పలువురు బన్నీకి విషెష్ తెలిపారు.