ఒకవైపు హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం ఘటన జరిగి వారం రోజులు కాలేదు. ఇంకా నిందితుడు కూడా దొరకలేదు. కానీ ఈ లోపే ఏపీలో దారుణం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా బి.కొత్త కోటలో ఇద్దరు చిన్నారులపై అనిల్ (20) అనే యువకుడు లైంగిక దాడి చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారులను అతడు మిద్దెపైకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.
బి.కొత్తకోట ఇందిరమ్మ కాలనీలో అమ్మమ్మ వద్ద ఈ ఇద్దరు చిన్నారులు ఉంటున్నారు. అయితే చిన్నారులు కేకలు వేయడంతో స్థానికులు గుర్తించి యువకుడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనిల్ కొద్దిరోజులుగా కాలనీలో చిన్నారులను వేధిస్తున్నట్లు స్థానికులు కూడా చెబుతున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.