కరోనా ఎఫెక్ట్ కారణంగా రెగ్యులర్ సినీ ప్రేమికులు, ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా ఓటిటిలకే అలవాటు పడిపోయారు. దీంతో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రముఖ ఓటిటి సంస్థలు అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్, ఆహా, వూట్, సోనీ లివ్, జీ5 లాంటివి.. విడుదలకు సిద్ధంగా ఉన్న చిన్న, పెద్ద సినిమాల హక్కులను దక్కించుకొని రిలీజ్ చేసేందుకు పోటీపడుతున్నాయి. కొవిడ్ తరువాత ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా నాలుగైదు వారాల్లోనే ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. ఈ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటం తగ్గించేశారు.
అయితే రేపు ఒక్క రోజు (జులై 29) ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఏకంగా ఒకేసారి 20 సినిమాలు/వెబ్ సిరీస్ లు రిలీజ్ కాబోతుండటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అందులో తెలుగుతో పాటు ఇతర భాషల డబ్బింగ్ సినిమాలు తెలుగులో అందుబాటులోకి రానున్నాయి. మరి ఆ సినిమాలేంటో చూడండీ..
ఆహా(Aha):
షికారు
ఏజెంట్ ఆనంద్ సంతోష్(సిరీస్ 1- ఎపిసోడ్ 3)
అమెజాన్ మినీ టీవీ(Amazon MiniTV): కేస్ తో బంతా హై(హిందీ – సిరీస్ 1)
నెట్ ఫ్లిక్స్(Netflix):
మసాబా మసాబా(హిందీ – సిరీస్ 2)
అన్ కపుల్డ్(ఇంగ్లీష్ – సిరీస్ 1)
రెబల్ చీర్ స్క్వాడ్(ఇంగ్లీష్ – సిరీస్ 1)
పర్పుల్ హార్ట్స్(ఇంగ్లీష్ మూవీ)
ది ఎన్ టైటిల్డ్(ఫిలిప్పినో మూవీ)
ఫ్యానటికో(స్పానిష్ మూవీ)
డిటెక్టివ్ కానన్: జీరోస్ టీ టైమ్(జపనీస్ – సిరీస్)
జీ5(Zee5):
పేపర్ రాకెట్(తమిళం సిరీస్ 1)
రంగ్ బాజ్(హిందీ సిరీస్ 3)
తప్ప(పంజాబీ – మూవీ)
ప్రకాశన్ పరకట్టే(మలయాళం – మూవీ)
డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Hotstar):
గుడ్ లక్ జెర్రీ(హిందీ – మూవీ)
19(1)(a) (మలయాళం – మూవీ)
వట్టం(తమిళం – మూవీ)
బిగ్ మౌత్(కొరియన్ సిరీస్ 1)
వూట్(Voot):
777 చార్లీ(కన్నడ)
హోయ్ చోయ్(Hoichoi):
సంపూర్ణ(బెంగాలీ మూవీ)
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.