టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఏషియాకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) 20 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఆడిట్లో పైలట్ తనిఖీలు సరిగాలేవని గుర్తించడంతోఈ ఫైన్ విధించింది. మూడు నెలల పాటు ఎయిర్ ఏషియాకు శిక్షణా హెడ్‌ను 33 నెలల పాటు ఆస్థానం నుంచి తప్పించింది. 8 మంది ఎగ్జామినర్లకు ఒక్కొక్కరికి 3 లక్షల జరిమానా విధించింది. సంస్థకు, స ంస్థలోని బాధ్యులది కలిపి మొత్తం 44 లక్షల రూపాయల జరిమానా విధించింది. డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ బృందం 2022, నవంబర్ 23-25 మధ్య నిఘా తనిఖీ నిర్వహించింది. ఈ సమయంలో పైలట్ ప్రావీణ్యత తనిఖీ సమయంలో ఎయిర్ ఏషియా పైలట్లు తప్పనిసరి చేయాల్సిన శిక్షణా కార్యక్రమాలు కొన్నింటిని చేయలేదని గుర్తించింది. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం ఇన్స్ట్రుమెంట్ రేటింగ్ చెక్ చేయలేదని, ఇది డీజీసీఏ నిబంధనల ఉల్లంఘనల కిందకు వస్తుందని తెలిపింది.
డీజీసీఏ గుర్తించిన లోపాలను అంగీకరిస్తున్నట్లు ఎయిర్ ఏషియా తెలిపింది. అదనపు సిమ్యులేటర్ శిక్షణా సెషన్లతో, డీజీసీఏతో సమన్వయంతో దిద్దుబాటు చర్యలు తీసుకున్నామని ఎయిర్ ఏషియా ప్రతినిధి తెలిపారు. తప్పనిసరి నియంత్రణ శిక్షణలో సిమ్యులేటర్ శిక్షణలో వ్యాయామాలను పూర్తి చేసినట్లు తెలిపారు. భద్రతకు ఎలాంటి ఇబ్బందిలేదని, డీజీసీఏ ఆదేశాలను సమీక్షిస్తున్నామని, అవసరమైతే అప్పీల్ చేసే విష యాన్ని పరిశీలిస్తామని ఆ ప్రతినిధి తెలిపారు. ఈ విషయంలో డీజీసీఏ ఎయిర్ ఏషియాకు చెందిన అకౌంటబుల్ మేనేజర్‌కు, ట్రైనింగ్ విభాగం హెడ్‌కు, ఎగ్జామినర్లకు సోకాజ్ నోటీసులు జారీ చేసింది. సంస్థ నుంచి వీరి నుంచి రాతపూర్వక సమాధానాలు వచ్చిన తరువాత పరిశీలించిన తరువాత చర్యలు తీసుకుంటామని డీజీసీఏ తెలిపింది.
డీజీసీఏ నిబంధనలు పాటించనందుకు విధించిన 20 లక్షల ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. శిక్షణా హెడ్‌ను 3 నెలల పాటు తొలగించాలని ఆదేశించింది. ఎగ్జామినర్లకు విధించిన ఫైన్ 3 లక్షల చొప్పున కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల డజీసీఏ పలు విమానయాన సంస్థలకు ఫైన్లు విధించింది. వివిధ ఉల్లంఘనల పట్ల డీజీసీఏ కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని నిబంధనలు తప్పక పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఎయిర్‌పోర్టులోనే ప్రయాణీలకు వదిలి వెళ్లిన గో ఎయిర్‌పై కూడా డీజీసీఏ ఫైన్ విధించింది.