Saturday, November 23, 2024

20% పెరిగిన ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు

సెమికండక్టర్ల అందుబాటు పెరగడం, పండగల సీజన్‌ డిమాండ్‌తో ఆగస్టులో ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు 21 శాతం పెరిగాయి. ఆగస్టులో కంపెనీల నుంచి డీలర్లకు ప్యాసిం జర్‌ వాహనాల సరఫరాలు 2,81, 210 యూనిట్లుగా ఉన్నాయని, జులైలో నెలలో ఇవి 2,32,224 యూనిట్లుగా ఉన్నట్లు సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యూ ఫాక్చరర్ (ఎస్‌ఐఏఎం) తెలిపింది.

ద్వీచక్ర వాహనాలు డీలర్లకు సరఫరా కూడా జులై లో 13,38,740 యూనిట్లు ఉంటే 16 శాతం పెరిగి ఆగస్టులో 15,57,429 యూనిట్లకు చేరుకుందని సైమా తెలిపింది. త్రీ వీలర్‌ వాహనాలు జులైలో 23,606 యూనిట్లు ఉంటే, ఇది 63 శాతం పెరిగి 38,369 యూనిట్లకు చేరాయి. అన్ని రకాల వాహ నాల అమ్మకాలు జులైతో పోల్చితే 18 శాతం పెరిగాయని సైమా తెలిపింది. జులైలో అన్ని రకాల వాహనాల అమ్మకాలు 15,94, 573 యూనిట్లు ఉంటే, ఆగస్టులో ఇవి 18,77,072 యూనిట్లకు పెరిగాయని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement