హైదరాబాద్ : బీఆర్ఎస్లోకి 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తానని తనతో టచ్ లోకి వచ్చారని కేసీఆర్ తెలిపారు. అయితే తాను దానికి నో చెప్పినట్లు వెల్లడించారు. ఆ పార్టీలోని ఓ కీలక నేత తనను సంప్రదించారని చెప్పారు. తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లోకి వెళ్లిన నేతలు బాధపడుతున్నారని అక్కడ అంతా బీజేపీ పెత్తనమే నడుస్తోందని చెప్పారని పేర్కొన్నారు. 104 మంది ఎమ్యేల్యేలు ఉన్న తన ప్రభుత్వాన్నే కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని చెబుతూ… ఇక 64 మంది ఉన్న కాంగ్రెస్ను కూల్చకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
- Advertisement -