రెండేళ్ల వయస్సులో పిల్లలకు మాటలే సరిగా రావు.. కానీ ఓ చిన్నారి మాత్రం ప్రపంచంలోని 205 దేశాల రాజధానుల పేర్లను తడబడకుండా చెప్పేస్తూ అందరినీ అబ్బురపరుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోను ఐఏఎస్ అధికారి ప్రియాంక శుక్లా ట్విటర్లో షేర్ చేశారు. ‘ఈ చిన్నారి పేరు ప్రణీనా.. వయస్సు 2.6 ఏళ్లు.. నా సహోద్యోగి ప్రదీప్ కూతురు. ఆమె 205 దేశాల రాజధానుల పేర్లను తడబడకుండా చెప్పేయగలదు. ఆఫ్ఘనిస్తాన్, అర్మేనియా, బహ్రెయిన్, భూటాన్ నుంచి ఇజ్రాయెల్, చైనా, సైప్రస్, జపాన్ వరకు ఏ దేశం పేరు చెప్పినా దాని రాజధాని పేరును ఠక్కున చెప్పేస్తుంది.’ అని ప్రియాంక శుక్లా పేర్కొన్నారు. ప్రణీనాది అసాధారణ ప్రతిభ అని కొనియాడారు. కాగా, ఈ వీడియోను ఇప్పటివరకూ 25 వేలకు పైగా మంది వీక్షించగా..2 వేలకు పైగా లైక్లు వచ్చాయి.