రెండు నెలల చిన్నారి ఏం చేస్తుంది. ఇదేం ప్రశ్న.. ఆకలి వేస్తే ఏడుస్తుంది..లేకపోతే నిద్రపోతుంది. కానీ ఇక్కడో చిన్నారి ఏకంగా పాట పాడిందంటే నమ్ముతారా. రెండు నెలల చిన్నారి.. తన తాతతో కలిసి పాట పాడటం గమనార్హం. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. తాత పాట పాడుతుంటే … దానికి ఆ చిన్నారి కూడా కోరస్ పాడటం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.ఈ వీడియోలొ తాత లాలి పాట పాడుతుంటే… దానిని అనుకరించడానికి ఆ చిన్నారి కూడా ప్రయత్నించడం గమనార్హం. ఆ చిన్నారి వయసు 2 నెలలు కావడం గమనార్హం.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా ఆకట్టుకుంటోంది. వీడియోలో, తాత శిశువును తన చేతుల్లో పట్టుకొని పాట పాడుతుండగా.. చిన్నారి కూడా తాతయ్యను అనుకరించే ప్రయత్నం చేసి అతనితో పాడటం విశేషం. వాళ్ల తాత వైపు చూస్తూ… ఆసక్తిగా అనుకరించడం విశేషం. తాత గొంతు అద్భుతంగా ఉందని… ఆచిన్నారి ప్రయత్నం మరింత ప్రశంసనీయమంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తాత తోపాటు… ఆ రెండు నెలల చిన్నారి పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది.ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.