Friday, November 22, 2024

Thiruvananthapuram: లుంగీలో గోల్డ్‌…. కోట్ల‌ల్లో ప‌ట్టుబ‌డ్డ బంగారం

తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒకే విమానంలో ప్రయాణించిన ఇద్దరు ప్రయాణికుల నుంచి సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గోల్డ్‌ స్మగ్లింగ్ కోసం వీళ్లు చేసిన పథకం తెలిసి కస్టమ్స్‌ అధికారులుబిత్తరపోయారు.

కోజికోడ్‌కు చెందిన సుహైబ్ (34)ను కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సుహైబ్ నుంచి ఫ్లాస్క్‌లో దాచి తెచ్చిన 1.959 కిలోల బంగారం మిశ్రమాన్ని అధికారులు గుర్తించారు. తిరువనంతపురం, కమలేశ్వరానికి చెందిన మరో ప్రయాణికుడు ముహమ్మద్ అఫ్సర్ (28) కూడా బంగారు ద్రావణంలో ముంచి బ్యాగ్‌లో ఉంచిన లుంగీలను స్వాధీనం చేసుకున్నారు. గోల్డ్‌ కోటెడ్‌తో మడిచిపెట్టి అక్రమంగా తరలిస్తున్న10 లుంగీలు పట్టుబడ్డాయి. ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్‌ అధికారులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా,.. లగేజీని ఎక్స్‌రే తనిఖీ చేశారు. దాంతో బంగారంలో ముంచిన లుంగీల గుట్టు రట్టైంది. దీంతో సరుకులను స్వాధీనం చేసుకున్న అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement