దేశీయ స్టాక్ మార్కెట్స్‌లో టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం రూ.2.85 లక్షల కోట్లు క్షీణించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ భారీగా దెబ్బతిన్నాయి. గత వారం సెన్సెక్స్ 2225.29 పాయింట్లు లేదా 3.89 శాతం నష్టపోగా.. నిఫ్టీ 691.30 పాయింట్లు లేదా 4.04 శాతం క్షీణించింది. గత వారం అంతర్జాతీయ పరిణామాల కారణంగా మార్కెట్లు కుప్పకూలాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1,14,767.5 కోట్లు తగ్గి.. రూ.17,73,196.68 కోట్లకు పరిమితమైంది. టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.42,847.49 కోట్లు క్షీణించి.. రూ.12,56,152.34 కోట్లకు పడిపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ మార్కెట్ క్యాప్ రూ.36,984.46 కోట్లు క్షీణించి రూ.7,31,068.41 కోట్లకు పతనమైంది. హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాప్ రూ.20,558.92 కోట్లు తగ్గి.. రూ.5,05,068.14 కోట్లకు పడిపోయింది. ఐసీఐసీఐ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ మార్కెట్ క్యాప్ రూ.16,625.96 కోట్లు తగ్గి.. రూ.5,00,136.52 కోట్లకు పడిపోయింది.
ఎయిర్‌టెల్‌కు రూ.16వేల కోట్లు..
అదేవిధంగా భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్ రూ.16,091.64 కోట్లు క్షీణించి.. రూ.3,90,153.62 కోట్లకు తగ్గింది. హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,924.03 కోట్లు క్షీణించి.. రూ.3,90,045.06 కోట్లకు పడిపోయింది. ఎస్‌బీఐ మార్కెట్ క్యాప్ రూ.10,843.4 కోట్లు తగ్గి.. రూ.4,32,263.56కోట్లకు పరిమితమైంది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.10,285.69 కోట్లకు పడిపోయి.. రూ.6,49,302.28 కోట్లకు క్షీణించింది. అదానీ మార్కెట్ క్యాప్ రూ.2,322.56 కోట్లు క్షీణించి.. రూ.4,49,255.28 కోట్లకు తగ్గింది. టాప్ టెన్ కంపెనీల విషయానికొస్తే.. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలోనే కొనసాగుతున్నది. ఆ తరువాత వరుసగా.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, ఐసీఐసీఐ బ్యాంకు, అదానీ, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..