Tuesday, November 26, 2024

సెప్టెంబర్‌ నాటికి 2.80ల‌క్ష‌ల‌ గ్రీన్‌ కార్డులు.. స్పీడ‌ప్ చేస్తున్న ఇమిగ్రేష‌న్ డిపార్ట్‌మెంట్‌

అమెరికా సిటీజన్‌ షిప్‌, ఇమ్రిగేషన్‌ డిపార్ట్‌ మెంట్‌ ఈ సంవత్సరం సెప్టెంబర్‌ నాటికి 2 లక్షల 80 వేల గ్రీన్‌ కార్డులను జారీ చేయాల్సి ఉంది. కోవిడ్‌ మూలంగా లక్ష్యానికి అనుగుణంగా గ్రీన్‌ కార్డులను జార చేయలేకపోయారు. ప్రస్తుతం ఇమ్రిగ్రేషన్‌ కార్యాలయాలు పని చేస్తున్నందున వీటి జారీని వేగవంతం చేశారు. ఎంప్లాయిమెంట్‌ ఆధారిత గ్రీన్‌ కార్డుల జారీని ఇప్పటికే గ త జూన్‌ నెల కంటే ఎక్కువ జారీ చేశారు. ఈ సంత్సరం మే నెల నాటికి 149733 గ్రీన్‌ కార్డులను జారీ చేశారు. అమెరికా వీసా ఆఫీస్‌ల అందుబాటులో ఉన్న డేటా ప్రకారం 2021లో ఉపయోగించని 66781 గ్రీన్‌ కార్డులు ఉన్నాయి. ఆ సంవత్సరంలో వాస్తవానికి 1.4 మిలియన్ల మంది ఇందుకు అర్హత కలిగి ఉన్నా, జారీ చేయలేకపోయారు. వీరిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు.

వీరిలో చాలా మంది సంవత్సరాలుగా గ్రీన్‌కార్డు ఎదురు చూస్తున్నవారు ఉన్నారు. వాస్తవానికి గత సంత్సరం అమెరికా అధికారులు లక్షా 80 వేల గ్రీన్‌కార్డులు జారీ చేసినప్పటికీ, ఇంకా జారీ చేయాల్సిన వి మిగిపోయాయి. కంపెనీలు జారీ చేసే గ్రీన్‌కార్డులు వేచి చూసే సమయం 2022 పాటికి మూడు సంవత్సరాలకు పెరిగింది. 2,500 డాలర్లు చెల్లించిన వారికి గ్రీన్‌ కార్డులు జారీ చేయడంతో వేచి చూసే సమయం 7 నెలలు తగ్గింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement