అమెరికా వెళ్లాలనుకునే వారికి ఇది శుభవార్త. అమెరికా ప్రభుత్వం ఇండియన్స్ కోసం కొత్తగా 2,50,000 కొత్త అపాయింట్స్ వీసా స్లాట్స్‌ను వారంతంలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. గత వారం అమెరికా వీసా అపాయింట్మెంట్ కోసం కనీసం ఢిల్లిలో 543రోజుల వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని వెల్లడించింది.
తాజాగా భారీగా అపాయింట్స్ ఇవ్వనున్నందున వేచి చూసే సమయం 126 రోజులు తగ్గిపోనుంది. ముంబై, చెన్నయ్, హైదరాబాద్ కేంద్రాల్లో మాత్రం 500 రోజులకు పైగా ఎదురు చూడకతప్పదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి మన దేశం నుంచి 1,50,000 మంది అమెరికా వెళ్లారు.
గత నెలలో అమెరికా నాన్ ఇమిగ్రేషన్ వీసాల కోసం 10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇవి 2019 కంటే 20 శాతం అధికం. భారత్‌లోని అమెరికా ఎంబసీ, కాన్సలెట్స్ లెక్కల ప్రకారం గత సంవత్సరం 12 లక్షల మంది ఇండియన్స్ అమెరికాను సందర్శించారు.
ప్రపంచ వ్యాప్తంగా అమెరికా మంజూరు చేస్తున్న వీసాల్లో ఇండియన్స్ 20 శాతం వీసాలు పొందుతున్నారు. ప్రస్తుతం అమెరికా కాన్సలేట్స్ అందించిన వివరాల ప్రకార వీసాల కోసం వేచి ఉండే సమయం న్యూఢిల్లిdలో 37 పని దినాలు, కోల్‌కతాలో 126 పనిదినాలు, ముం బైలో 322 పని దినాలు, చెన్నయ్‌లో 541 పని దినాలు, హైదరాబాద్‌లో 511 పని దినాలుగా ఉన్నాయి.