Tuesday, November 26, 2024

9 కంపెనీలకు పెరిగిన విలువ 2.12 లక్షల కోట్లు.. గత వారం స్టాక్‌మార్కెట్‌లో లాభాల ఫలితం

టాప్‌ 10 కంపెనీల్లో 9 కంపెనీల మార్కెట్‌ విలువ గత వారం 2.12 లక్షల కోట్ల మేర పెరిగింది. మార్కెట్‌ విలువ పెరుగుదలలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అగ్రస్థానంలో ఉంది. టీసీస్‌ రెండో స్థానంలో ఉంది. గత వారం ట్రేడింగ్‌లో బీఎస్‌సీ 30 ఇండెక్స్‌ 844.68 పాయింట్లు లాభపడింది. 1.38 శాతం పెరుగుదల నమోదు చేసింది. ఇందులో ఉన్న టాప్‌ 10 కంపెనీల్లో ఒక్క హిందూస్థాన్‌ యూనిలీవర్‌(హెచ్‌యూఎల్‌) మాత్రమే నష్టపోయింది. మిగిలిన టాప్‌ 9 కంపెనీలకు కలిపి 2,12,478.82 కోట్ల
మేర విలువ పెంచుకున్నాయి.

అత్యధికంగా లాభపడిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు వారం రోజుల్లో 63,462.58 కోట్లు విలువ పెరిగింది. దీంతో కంపెనీ మొత్తం మార్కెట్‌ విలువ 8,97,980.25 కోట్లకు పెరిగింది. టీసీఎస్‌ విలువ 36,517.34 కోట్లు పెరిగి, 12,13,378.03 కోట్లకు కంపెనీ విలువ పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ విలువ 29,422.52 కోట్లు పెరిగి 4,81,818.83 కోట్లకు చేరింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ విలువ 26,317.30 కోట్లు పెరిగి 17,80,206.22 కోట్లకు చేరింది. ఇన్ఫోసిస్‌ విలువ 23,626.96 కోట్లు పెరిగి 6,60,650.10 కోట్లుగా ఉంది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ మార్కెట్‌ విలువ 20,103.92 కోట్లు పెరిగి మొత్తం విలువ 4,56,992.25 కోట్లకు చేరింది. ఎస్‌బీఐ విలువ 6,559.59 కోట్లు పెరిగి 5,36,458.41 కోట్లకు చేరింది. భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీ మార్కెట్‌ విలువ 5,591.05 కోట్లు పెరిగి 4,59,773.28 కోట్లుగా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 877.56 కోట్లు పెరిగి 6,32,192.05 కోట్లుగా ఉంది.టాప్‌ 10లో ఉన్న హిందూస్థాన్‌ యూనిలీవర్‌ కంపెనీ మార్కెట్‌ విలువ 3,913.07 కోట్లు తగ్గి 5,88,220.17 కోట్లకు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement