Saturday, November 23, 2024

Chandrayaan landing | జాబిల్లిపై దుమ్ము లేపిన చంద్రయాన్‌..

భారత్‌ కీర్తి పతాకను అంతరిక్షంలో ఎగురవేసిన చంద్రయాన్‌-3 మిషన్‌కు చెందిన ల్యాండర్‌ విక్రమ్‌ జాబిల్లిపైన దిగుతున్న సమయంలో అక్కడి ఉపరితలంపైన ఉన్న దాదాపు 2.06 టన్నుల రాళ్ళు, ధూళిని చెల్లాచెదురు చేసిందని, దుమ్ము ఎగసిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుక్రవారం వెల్లడించింది.

చంద్రయాన్‌-3 ఆగస్టు 23న జాబిల్లిపైకి చరిత్ర సృష్టిస్తూ దిగింది. జాబిల్లి ఉపరితలంపై దక్షిణ ధృవ ప్రాంతంలో శివశక్తి కేంద్రం వద్ద చంద్రయాాన్‌-3 కు చెందిన ల్యాండర్‌ విక్రమ్‌, రోవర్‌ ప్రజ్ఞాన్‌ దిగాయి. విక్రమ్‌ దిగుతున్న సమయంలో జాబిల్లి ఉపరితలంపైన ఉన్న ధూళి, రాళ్ళు, ఇతర పదార్థాలు పైకి లేచి కనువిందు చేసే ఒక ఆవృతం (ఎజెక్టా హాలో) ఏర్పడింది.

- Advertisement -

ఇస్రోలో భాగమైన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ(ఎన్‌ఆర్‌ఎస్సీ)కి చెందిన శాస్త్రవేత్తలు ఈ అద్భుతమైన ప్రక్రియను రికార్డు చేసి అధ్యయనం చేశారు. వారి అధ్యయనం ప్రకారం విక్రమ్‌ ల్యాండింగ్‌ సమయంలో జాబిల్లి ఉపరితలంపైన దాదాపు 2.06 టన్నుల పదార్థం ఎగసి శివశక్తి కేంద్రం చుట్టుపక్కల 108.4 చదరపు మీటర్ల మేర చెల్లాచెదురుగా పడింది.

ఎజెక్టా హాలో ప్రక్రియకు సంబంధించిన పూర్తి అధ్యయనం ఇండియన్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సొసైటీ జర్నల్‌లో ప్రచురితమైంది. ఎగసిన దుమ్మూ ధూళి సద్దుమణిగిన తర్వాతనే ప్రజ్ఞాన్‌ రోవర్‌ను జాబిల్లి ఉపరితలంపైకి దిగనిచ్చారు ఇస్రో శాస్త్రవేత్తలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement