Saturday, November 23, 2024

ఎంఎస్‌ఎంఈలకు 1900 కోట్ల రుణ మంజూరు లక్ష్యం.. స్టేట్‌ లెవెల్‌ బ్యాంకర్స్‌ కమిటీ నిర్ణ‌యం

అమరావతి, ఆంధ్రప్రభ: యూనియన్‌ ఎమ్‌ఎస్‌ఎమ్‌ఇ సువిధ పధకం క్రింద సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల అభివృద్ధికి రూ.50 కోట్ల వరకూ రుణసదుపాయం కల్పిస్తున్నామన్నారు. పారిశ్రామిక వాడల్లో ఎమ్‌ ఎస్‌ ఎమ్‌ ఇ యూనిట్‌ లకు తక్షణ రుణ సదుపాయం కోసం యూనియన్‌ బ్యాంకు 1900 కోట్లు రుణాలుగా అందించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ మరియు స్టేట్‌ లెవెల్‌ బ్యాంకర్స్‌ కమిటీ కన్వీనర్‌ యు. బ్రహ్మానంద రెడ్డి అన్నారు. విజయవాడ వన్‌ టౌన్‌లోని యూనియన్‌ బ్యాంకు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బ్యాంకు అమలు చేస్తున్న వివిధ పధకాల గురించి అయన వివరించారు.

రైతులు, వ్యాపారస్తులకు, పారిశ్రామిక యూనిట్‌లకు, వివిధ వృత్తులకు, మహిళలకు యూనియన్‌ బ్యాంకు అఫ్‌ ఇండియా ఇతోధికంగా ఆర్ధిక సహాయాన్ని అందిస్తోందన్నారు. ఈ మధ్య అకాల వర్షాలు, తుపాన్‌, కోవిడ్‌ కారణంగా దెబ్బతిన్న వ్యవసాయరంగం, వ్యాపార, ఇతర రంగాలకు చేయూతనిస్తూ వారి అభివృద్ధికి యూనియన్‌ బ్యాంకు కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగా అనేక పధకాలను అమలు చేయడం ద్వారా ఇతోధికంగా రుణ సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. మహిళా సాధికారిత కోసం వివిధ రంగాల్లో 50 శాతం వరకు మహిళలకు రుణ సదుపాయం కల్పించేందుకు యూనియన్‌ నారీ శక్తి అనే పధకాన్ని అమలు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా ఔత్సాహికులైన మహిళలకు 10 లక్షల నుండి 10 కోట్ల వరకు రుణ సౌకర్యం కల్పిస్తున్నామన్నామని, 2 కోట్ల వరకు ఎలాంటి హామీ పూచీకత్తు లేకుండా రుణాలు అందిస్తున్నామన్నారు.

యూనియన్‌ ఉమెన్‌ ప్రొఫెషనల్‌ లోన్స్‌ పధకం క్రింద వివిధ వృత్తుల్లో ఉన్న మహిళలకు 50 లక్షల వరకూ ఎలాంటి ప్రాసెసింగ్‌ చార్జీలు లేకుండా తక్షణం రుణాలు అందిస్తున్నామన్నారు. ఆయుష్మాన్‌ ప్లస్‌ పధకం క్రింద ఆసుపత్రుల నిర్మాణానికి వైద్య వసతులు, వైద్య సౌకర్యాల కల్పనకు డాక్టర్స్‌ కు, వైద్య రంగానికి చెందిన వారికీ 100 కోట్ల వరకూ రుణ సౌకర్యాన్ని అందిస్తున్నామన్నారు. రైతులకు యూనియన్‌ కిసాన్‌ కామధేను గోల్డ్‌ లోన్‌ పధకం క్రింద 5 లక్షల వరకూ వ్యవసాయ సంబంధ గోల్డ్‌ లోన్స్‌ ను అందిస్తున్నామన్నారు. కిసాన్‌ తత్కాల్‌ పధకం క్రింద 50 వేల వరకు పంట రుణాలు అందిస్తున్నామన్నారు. పంటల అభివృద్ధికి పశు, మత్స్య రంగాల అభివృద్ధికి కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు రైతులకు అందిస్తున్నామని దీని ద్వారా 50 వేల వరకూ నగదు బదిలీ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.

యూనియన్‌ ఫార్మ్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ పధకం క్రింద రైతులకు టూ వీలర్‌, ఫోర్‌ వీలర్‌ వాహనాలకు తక్కువ వడ్డీపై రుణాలు అందిస్తున్నామన్నారు. శిశు ముద్ర ఎస్‌ టి పి డిజిటల్‌ లోన్‌ పధకం క్రింద డిజిటల్‌ మాధ్యమం (లోన్‌ యాప్‌) ద్వారా 50 వేలరూపాయల వరకూ ముద్ర లోన్‌ పొందవచ్చునన్నారు. యూనియన్‌ అగ్రి ఇన్ఫా స్ట్రక్చర్‌ స్కీం క్రింద వ్యవసాయ గోదాములు, శీతల గిడ్డంగులు, మరియు ఇతర వ్యవసాయ సంబంధమైన కట్టడాలకు, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు 3 శాతం వడ్డీ రాయితీతో రెండు కోట్ల వరకూ కేంద్ర ప్రభుత్వం రుణ సౌకర్యం అందిస్తున్నదన్నారు. డ్వాక్రా మహిళలకు 20 లక్షల వరకూ ఎటు-వంటి పూచీకత్తు లేకుండా రుణసౌకర్యం అందిస్తున్నామని డ్వాక్రామ మహిళలకు వ్యక్తిగత రుణాలు క్రింద ఎటు-వంటి హామీ లేకుండా 10 లక్షల వరకూ రుణ సౌకర్యం అందిస్తామన్నారు. వివిధ రంగాలు, వివిధ వర్గాల ప్రజలు ఆర్ధిక స్వావలంబన సాధించే దిశగా యూనియన్‌ బ్యాంకు అఫ్‌ ఇండియా ఇతోధికంగా రుణ సౌకర్యాలు కల్పిస్తున్నదని బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement