Tuesday, November 12, 2024

First Session – నేటి నుంచి 18వ పార్లమెంట్ సమావేశాలు – ఎంపీల ప్రమాణ స్వీకారం

18వ పార్లమెంట్ సమావేశాలు మరి కొద్ది సేపటిలో ప్రారంభం అవుతున్నాయి. 24, 25 తేదీల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలంతా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీనిలో భాగంగా ప్రొటెం స్పీకర్‌గా రాష్ట్రపతి భవన్‌లో ఒడిశాకు చెందిన భర్తృహరి మహతాబ్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు.

ఇక రెండ్రోజుల పాటు ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. అనంతరం జూన్ 26న స్పీకర్ ఎన్నిక జరగనుంది…

అయితే స్పీకర్ పోస్టుకు పోటీ నెలకొంది. ఈ పోస్టును ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలు ఆశిస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం తన దగ్గరే ఉంచుకోవాలని చూస్తోంది. అయితే రాజమండ్రి బీజేపీ ఎంపీ పురందేశ్వరికి ఈ పదవి దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరీ ఆ పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి.

- Advertisement -

ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజే దాదాపు 280 మంది లోక్ సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పెషల్ సెషన్ కావడంతో క్వశ్చన్ అవర్ లేదా జీరో అవర్ ఉండదు. తొలుత ప్రధాని మోడీ ప్రమాణం చేశాక సీనియారిటీ ఆధారంగా మంత్రులు, ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది.అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండటంతో ఏపీ నుంచి గెలిచిన ఎంపీలు, తెలంగాణ ఎంపీలు తొలిరోజే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రసంగిస్తారు. జులై 3వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమి ఆశిస్తోంది. ఈ పదవి ఇవ్వకపోతే స్పీకర్ పదవికి పోటీ చేస్తామని చెబుతోంది. మరోవైపు ఈసారి కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా సంపాదించింది. ఈ పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి

Advertisement

తాజా వార్తలు

Advertisement