Tuesday, November 26, 2024

Corona | దేశంలో కొత్తగా 185 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 185 కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,46,76,515కు చేరాయి. ఇందులో 4,41,42,432 మంది కోలుకున్నారు. మరో 3402 కేసులు యాక్టివ్‌గా ఉండగా, ఇప్పటివరకు 5,30,681 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో మహమ్మారికి ఒకరు బలయ్యారు. రికవరీ రేటు 98.72 శాతంగా ఉండగా, యాక్టివ్‌ కేసులు 0.01 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2,20,02,12,178 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. బుధవారం ఒక్కరోజే 1,17,538 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నది.

చైనా నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్‌..

చైనా నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం ల్యాబ్‌కు పంపారు. కాగా, గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన 34 ఏళ్ల వ్యాపారవేత్త పనుల నిమిత్తం ఇటీవల చైనా వెళ్లాడు. ఈ నెల 19న గుజరాత్‌కు తిరిగి వచ్చాడు. అధికారులు ఆయనకు కరోనా పరీక్ష నిర్వ#హంచగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇన్‌ఫెక్షన్‌ నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం గాంధీనగర్‌ ల్యాబ్‌కు పంపారు. బీఎఫ్‌.7 వేరియంట్‌ కరోనా చైనాను వణికిస్తున్నది. ఈ నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement