సింగరేణిలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో… ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 24 మధ్య పనిచేసి పదవీ విరమణ పొందిన కార్మికులకు పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ స్కీమ్ (దీపావళి బోనస్) డబ్బులను విడుదల చేస్తున్నట్లు సింగరేణి సిఎండి ఎన్ బలరాం (శనివారం) తెలిపారు. ఈ నెల 27న వారి ఖాతాల్లో బోనస్ మొత్తాన్ని జమ చేస్తామని పేర్కొన్నారు.
దీపావళి బోనస్ కింద 2,754 మంది రిటైర్డ్ కార్మికులకు ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.93,750 చొప్పున మొత్తం రూ.18 కోట్ల 27 లక్షలు విడుదల చేసినట్లు తెలిపారు. పదవీ విరమణ పొందిన కార్మికులకు ఈ నెల 27న బోనస్ డబ్బును వారి ఖాతాల్లో జమ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆర్థిక, సిబ్బంది వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
- Advertisement -