గుజరాత్‌లోని వడోదరకు చెందిన 17 ఏళ్ల కుర్రాడు అథర్వ అమిత్ మూలే సరికొత్త రికార్డు సృష్టించాడు. అతడు సుమారు 91 దేశాలకు చెందిన జాతీయ గీతాలను ఆలపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి అతడు పురస్కారం కూడా అందుకున్నాడు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, బ్రిటన్, ఖతార్, సిరియా, యమెన్, న్యూజిలాండ్ లాంటి దేశాల జాతీయ గీతాలను కూడా అథర్వ అమిత్ మూలే చాలా అలవోకగా ఆలపిస్తున్నారు. ఈ ప్రపంచం వసుదైక కుటుంబం అన్న విశ్వాసాలను మనం నమ్ముతామని, అందుకోసమే ఇతర దేశాలకు చెందిన జాతీయ గీతాలను నేర్చుకోవాలన్న పట్టుదల తనలో కలిగినట్లు అమిత్ మూలే చెప్పాడు. కేవలం ఇతర దేశాల గీతాలను పాడడమే కాదు.. వాటి అర్ధాలను కూడా అమిత్ మూలే విడమరిచి చెప్తుండటం విశేషం.
ఇది కూడా చదవండి: ఆన్‌లైన్ క్లాసు జరుగుతుండగా.. లైవ్‌లో శృంగారం చేసిన విద్యార్థి