Tuesday, November 26, 2024

16th, April – ఆ రోజున సార్వత్రిక ఎన్నికలా? ఎలక్షన్ కమిషన్ క్లారిటీ

లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 16వ తేదీ నుంచి జరుగుతాయనే అర్థం వచ్చేలా ప్రధాన ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి ఢిల్లీలోని 11 జిల్లాల ఎన్నికల అధికారులకు ఓ సర్క్యులర్ జారీ అయింది. ఈ కాపీ సోషల్ మీడియాకు ఎక్కింది. దీనిపై ఎన్నికల సంఘం తాజాగా వివరణ ఇచ్చింది. ఈ తేదీ కేవలం రిఫరెన్స్ కోసం ప్రస్తావించింది మాత్రమేనని పేర్కొంది..

ఆ సర్క్యులర్ తో లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 16వ తేదీ నుంచి మొదలవుతాయా? అనే చర్చ జరిగింది. అయితే, అధికారికంగా ఈసీ ప్రకటించకపోవడంతో గందరగోళం నెలకొంది. ఈ సర్క్యులర్ పై వివరణ ఇవ్వాల్సిందిగా మీడియా ప్రతినిధులు ఎన్నికల సంఘాన్ని సంప్రదించారు.

ఈ సర్క్యులర్ పై ఢిల్లీ సీఈవో కార్యాలయం ఎక్స్ వేదికపై వివరణ ఇచ్చింది. ఈ తేదీలు కేవలం రిఫరెన్స్ కోసమేనని స్పష్టం చేసింది. ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫీసు నుంచి ఓ సర్క్యులర్ పై పలు మీడియా సంస్థలు స్పష్టత కోరాయని సీఈవో ఆఫీసు పోస్టులో పేర్కొంది. ఏప్రిల్ 16,2024 తేదీ 2024 లోక్ సభ ఎన్నికలవేనా? అనే ప్రశ్నలు వేశాయని తెలిపింది.

ప్రతిసారి ఎన్నికల సమయంలో ఈ సంప్రదాయాన్ని ఈసీ పాటిస్తుందని కొన్ని వర్గాలు తెలిపాయి. ముందుగా ఒక రిఫరెన్స్ డేట్ పెట్టుకుని అందుకు అనుగుణంగా ముందస్తు కార్యకలాపాలను ఎన్నికల అధికారులు పూర్తి చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement