Tuesday, November 26, 2024

దేశంలో కొత్తగా 1690 కరోనా కేసులు, 15మంది మృతి

దేశంలో కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం 1,600 కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 1,47,177 మందిని పరీక్షించగా.. 1,690 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,49,76,599కి చేరింది. దేశంలో యాక్టివ్‌ కేసులు 20 వేల దిగువకు చేరాయి. ప్రస్తుతం 19,613 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,44,25,250 మంది కోలుకున్నారు.

గత 24 గంటల్లో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,31,736కి పెరిగింది. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.04 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.77 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,86,764) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement