Thursday, November 21, 2024

న్యూఢిల్లీ : టాటా మోటార్స్ సీఈవోగా మార్క్ లిస్టో సెల్లా

: దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్‌ నూతన సీఈవో, ఎండీగా మార్క్‌ లిస్టోసెల్లా నియమితులయ్యారు. జులై 1, 2021 నుంచి ఆయన పదవీ బాధ్య తలు స్వీకరించనున్నారు. ప్రస్తు త సీఈవో గుంటెర్‌ బుచ్చెక్‌ బాధ్యతలను ఆయ న స్వీకరించను న్నారు. బుచ్చెక్‌ కాంట్రాక్ట్‌ త్వరలోనే అంటే జూన్‌ 31, 2021న ముగియ నుంది. ఆ తర్వాత జర్మనీలో పనిచేయాలని ఆయన కోరుకుంటున్నారు. టాటా మోటార్స్‌లోకి మార్క్‌కు స్వాగతం చెప్పేందుకు సంతోషిస్తున్నానని టాటా మోటార్స్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ ప్రకటించారు. కమర్షియల్‌ వాహన వ్యాపారంలో అపారమైన అనుభవం, పరిజ్ఞానం ఉన్నాయి. భారత్‌లో విస్తృతంగా కార్యకలాపాలపై నిర్వహణపై ఆయనకు అనుభవం ఉందని తెలిపా రు. మార్క్‌ తన విశేష అనుభవంతో టాటా మోటార్స్‌లో మార్పులు తీసుకొ స్తారని, భారతీయ వ్యాపారాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్తారని ఆశిస్తున్నామని చంద్రశేఖరన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా లిస్టోసెల్లా గతంలో ఫుసో ట్రక్‌ అండ్‌ బస్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడిగా, ఆసియలో డైవ్లుర్‌ ట్రక్‌ హెడ్‌గా పనిచేశారు. మరోవైపు పదవీకాలం ముగిసిన తర్వాత జర్మనీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement