Friday, November 22, 2024

Delhi | 1,600 పోస్టులు ఖాళీ.. అవికూడా భ‌ర్తీ చేయాలి : ఆర్. కృష్ణయ్య

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: గ్రూప్-1 నోటిఫికేషన్‌లో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు, బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. ఢిల్లీలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని సరిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం రాష్ట్రంలో 1,600 పోస్టులు ఖాళీలు ఉన్నాయని, కానీ కేవలం 563 పోస్టులను భర్తీ చేయడం కోసమే నోటిఫికేషన్ జారీ చేశారని వెల్లడించారు.

కొత్త జిల్లాలు, మండలాలు, మునిసిపాలిటీలు ఏర్పడ్డాక పాలనా వ్యవస్థలో అధికారులు, సిబ్బంది అవసరం పెరిగిందని తెలిపారు. ఐఏఎస్ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి పెరిగిన ఉద్యోగాలను గుర్తించి వాటిని వెంటనే భర్తీ చెయ్యాలని డిమాండ్ చేశారు. అలాగే 40 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. అప్పుడే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని వెల్లడించారు. నిరుద్యోగుల ఆందోళనతో ప్రభుత్వాలే మారాయని, ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు దృష్టిలో పెట్టుకోవాలని హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement