ఈ కాలంలో చదువుకొనే వయసులో ఉండే పిల్లలు ఆటలకు అలవాటు పడి ఫోన్ కు అంకితం అయిపోతున్నారు.. ఆట కోసం ఎంతకైనా తెగించేలా తయారవుతున్నారంటే వాళ్లు ఏ స్థాయిలో మొబైల్ గేమ్స్ కి అలవాటు పడ్డారో అర్థం చేసుకోవచ్చు. మొబైల్ లో ఆటలు వద్దని తల్లిదండ్రులు మందలిస్తే సూసైడ్ చేసుకొనే స్టేజ్ కి వెల్లిపోయారు. ఆటలకు బాగా అలవాటు పడ్డ మరికొందరైతే ఆ గేమ్స్ కోసం ఎంత ఖర్చైనా చేయాడానికి వెనుకాడడం లేదు. అలానే హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ ప్రాంతానికి చెందిన ఓ 16 ఏళ్ల బాలుడు ఆన్‌లైన్ గేమ్‌ల చెల్లింపులకు తన తల్లి బ్యాంకు ఖాతాలను ఉపయోగించాడు. అలా ఆడుతూ దాదాపు రూ.36 లక్షలు పోగొట్టుకున్నాడు.
తన తాత మొబైల్ ఫోన్‌లో ఫ్రీ ఫైర్ గేమింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు అంబర్‌పేట్ ఏరియాకి చెందిన ఓ బాలుడు. మొదట్లో ఆ గేమ్ కోసం రూ.1500 చెల్లించాడు.. ఆ తర్వాత తన తల్లి బ్యాంకు ఖాతా నుంచి రూ.10వేలు తీసుకుని గేమ్ ఆడాడు. ఆటలకు అలవాటు పడడంతో కుటుంబసభ్యులకు తెలియకుండా భారీగా ఖర్చు చేయడం ప్రారంభించాడు. ఏకంగా రూ.1.45 లక్షల నుంచి రూ.2 లక్షల దాకా చెల్లింపులు చేస్తూనే ఉన్నాడు. తీరా డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు అతని తల్లి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ)కి వెళ్లగా.. ఖాతాలో డబ్బులు లేవని తెలుసుకుని షాక్ కు గురయ్యారు. తన ఖాతా నుంచి మొత్తం రూ.27 లక్షలు ఖర్చయ్యాయి. ఆ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో తన ఖాతాను తనిఖీ చేయగా రూ.9 లక్షలు మాయమైనట్లు గుర్తించారు. దీంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. అది తన భర్త కష్టపడి సంపాదించిన డబ్బు అని పోలీసులకు చెప్పింది. తన భర్త మరణం తర్వాత కుటుంబానికి అందిన డబ్బుని రెండు బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు పోలీసులకు ఇచ్చిన కంప్లెయింట్‌లో తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.