దేశంలో నాలుగు నెలల సుధీర్ఘ విరామం తర్వాత 25 వేలలోపు కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 25,166 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాక తెలిపింది. 154 రోజుల తర్వాత అతి తక్కువగా కేసులు రికార్డయ్యాయని పేర్కొంది. తాజాగా 36,830 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 24 గంటల్లో మరో 437 మంది మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,22,50,679కు పెరిగింది. ఇందులో 3,14,48,754 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ బారినపడి మొత్తం 4,32,079 మంది మృత్యువాత పడ్డారు.
ఇది కూడా చదవండి: శ్రీవారిని దర్శించుకున్న లోక్సభ స్పీకర్ ఓంబిర్లా..