Tuesday, November 26, 2024

2024 నాటికి 15 కోట్లకు 5జీ యూజర్లు

దేశంలో ప్రధాన టెలికం సంస్థలన్నీ 5జీ నెట్‌వర్క్ విస్తరణను భారీ స్థాయిలో చేపట్టాయి. రిలయన్స్‌ జియో, ఎయిర్‌ టెల్‌, వోడాఫోన్‌ ఐడియా సంస్థలు అన్ని ప్రధాన నగరాల్లో 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ఈ సంవత్సరం చివరి నాటికి దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకు వస్తామని ఇప్పటికే జియో ప్రకటించింది. యూజర్లు కూడా పెద్ద సంఖ్యలో తమ మొబైల్‌ ఫోన్లను అప్‌గ్రేడ్‌ చేసుకుంటున్నారు. వివిధ సెల్‌ఫోన్‌ కంపెనీలు కూడా 5జీ
హ్యండ్‌ సెట్లను భారీ స్థాయిలో మార్కెట్‌లో విడుదల చేస్తున్నాయి. 2024 నాటికి దేశంలో 5జీ మొబైల్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 15 కోట్లకు చేరుతారని నోకియా అంచనా వేసింది.

తగ్గుతున్న 2జీ సబ్‌స్రైబర్లు..

దేశంలో 2024 నాటికి 4జీ, 5జీ చందాదారుల సంఖ్య 99 కోట్లకు చేరుతుందని నోకియా తెలిపింది. 2జీ వినియోగించేవారి సంఖ్య 15 కోట్ల వరకు ఉన్నారని పేర్కొంది. ప్రస్తుతం వోడాఫోన్‌, ఎయిర్‌టెల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌లో 2జీ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 35 కోట్ల ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో 2 కోట్ల మంది 5జీ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. గత సంవత్సరం అక్టోబర్‌లో దేశంలో 5జీ సర్వీస్‌లు ప్రారంభమయ్యాయి. 2023-24 నాటికి 10 కోట్ల మంది 5జీ కస్టమర్లను చేర్చుకోవాలని జీయో లక్ష్యంగా పెట్టుకుంది.
8.5 కోట్ల మంది దగ్గర 5జీఫోన్లు నోకియా నివేదిక ప్రకారం 2022 లో ఇండియాకు 7 కోట్ల 5జీ మొబైల్‌ ఫోన్లు దిగుమతి అయ్యాయి. 73 కోట్ల యాక్టివ్‌ యూజర్లలో 8.5 కోట్ల మంది దగ్గర 5జీ స పోర్టు చేసే ఫోన్లు ఉన్నాయని నోకియా తెలిపింది. 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వస్తున్నకొద్దీ యూజర్ల సంఖ్య కూడా పెరగనుంది.

5జీ నెట్‌వర్క్‌ పెరిగితే డేటా వినియోగం కూడా గణనీయంగా పెరగనుందిన నోకియా అంచనా వేసింది. 2027 నాటికి నెలకు ఒక్కో యూజర్‌ వినియోగించే సగటు డేటా 46 జీబీగా చేరుతుందని తెలిపింది. ప్రస్తుతం అది 19.5 జీబీగా ఉన్నట్లు తెలిపింది. ప్రపంచంలోనే అత్యధికంగా డేటా వినియోగించే దేశంగా భారత్‌ నిలవనుంది. కార్పొరేట్లు ప్రైవేట్‌ వైర్‌లైస్‌ నెట్‌వర్క్‌పై చేసే ఖర్చు 2027 నాటికి 240 మిలియన్‌ డాలర్లుగా ఉంటుందని నోకియా నివేదిక తెలిపింది. మొత్తం 5జీ ఆదాయంలో 40 శాతం ఎంటర్‌ప్రైజ్‌ బిజినెస్‌ బిజినెస్‌ ద్వారానే రానుంది. 2027 నాటికి దేశంలో 2,400 వరకు ప్రైవేట్‌ వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌లు ఉండే అవకాశం ఉంది. ఈ సారి 5జీ వేలంలో ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ కోసం స్పెక్ట్రమ్‌ కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రైవేట్‌ నెట్‌వర్క్‌లపై ట్రాయ్‌ ఇంకా మార్గదర్శకాలను విడుదల చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement