ఇన్వెస్టర్ల నుంచి అక్రమంగా వసూలు చేసిన సొమ్మును రికవరీ చేసేందుకు ప్రమోటర్లు, డైరెక్టర్లతోపాటు సన్‌హెవెన్ ఆగ్రో ఇండియా, రవికిరణ్ రియాల్టి ఇండియా సహా ఏడు కంపెనీలకు చెందిన 15 ఆస్తులను ఆగస్టు 21న వేలం వేయనున్నట్లు సెబీ మంగళవారం తెలిపింది. ఆస్తులు వేలం వేయబడే ఇతర సంస్థల జాబితాలో ఇన్ఫోకేర్ ఇన్‌ఫ్రా, భారత్ కృషి సమృద్ధి ఇండస్ట్రీస్ లిమిటెడ్, జిఎస్‌హెచ్‌పి రియల్‌టెక్ లిమిటెడ్, జస్ట్-రిలయబుల్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్, న్యూలాండ్ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉన్నాయి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) జారీ చేసిన పబ్లిక్ నోటీసు ప్రకారం ఆస్తులను రూ. 13 కోట్ల రిజర్వ్ ధరతో వేలం వేయనున్నారు.
ఈ ఆస్తులలో పశ్చిమ బెంగాల్‌లో ఉన్న భూములు, నివాస భవనం ఉన్నాయి. 15 ప్రాపర్టీలలో, నాలుగు భారత్ కృషి సమృద్ధి ఇండస్ట్రీస్‌కు సంబంధించినవి, మూడు జస్ట్- రిలయబుల్ ప్రాజెక్ట్స్ ఇండియావి, న్యూలాండ్ ఆగ్రో ఇండస్ట్రీస్‌కు సంబంధించినవి, రెండు సన్‌హెవెన్‌కు సంబంధించినవి, రవికిరణ్ రియాల్టిd ఇండియా, ఇన్ఫోకేర్ ఇన్‌ఫ్రా, జిఎస్‌హెచ్‌పి రియల్‌టెక్‌లకు సంబంధించిన ఒక్కొక్కటి ఉన్నాయి. కంపెనీలు,వాటి ప్రమోటర్లు, డైరెక్టర్లపై రికవరీ ప్రక్రియలో ఆస్తుల విక్రయానికి బిడ్లను ఆహ్వానిస్తూ, ఆగస్టు 21న ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు వేలం ఆన్‌లైన్‌లో నిర్వహించబడుతుందని సెబీ తెలిపింది.