Friday, September 20, 2024

AP: బాణాసంచా పేలి కుప్పకూలిన ఇల్లు… 14 మందికి గాయాలు…

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని రావులచెరువులో ఓ ఇంట్లో బాణాసంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది.. ఈ ఘటనలో 14మందికి తీవ్ర గాయాల‌య్యాయి. బాణాసంచా పేలుడు ధాటికి రెండు అంతస్తుల భవనం తునాతునకలు అయ్యింది.

ఇక గాయ‌ప‌డిన వారిలోని ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కొందరిని కిమ్స్‌కు తరలించారు. ఘటనాస్థలిని కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు పరిశీలించారు. ఆసుపత్రిలో బాధితులను ఎమ్మెల్యే ఆనందరావు పరామర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement