అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని రావులచెరువులో ఓ ఇంట్లో బాణాసంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది.. ఈ ఘటనలో 14మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాణాసంచా పేలుడు ధాటికి రెండు అంతస్తుల భవనం తునాతునకలు అయ్యింది.
ఇక గాయపడిన వారిలోని ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కొందరిని కిమ్స్‌కు తరలించారు. ఘటనాస్థలిని కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు పరిశీలించారు. ఆసుపత్రిలో బాధితులను ఎమ్మెల్యే ఆనందరావు పరామర్శించారు.