Friday, November 22, 2024

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఘోరం – ర‌క్త‌మార్పిడితో 14 మంది చిన్నారుల‌కు ఎయిడ్స్ ..

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. రక్తమార్పిడి ద్వారా 14 మంది చిన్నారులకు హెచ్ఐవీ , హెపటైటిస్ సోకడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలకలం రేపింది. కాన్పూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో నడుస్తున్న లాలా లజపతిరాయ్ ఆసుపత్రిలో 14 మంది పిల్లలకు రక్త మార్పిడి చేశారు. అనంతరం వారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. రక్త పరీక్షలు చేయగా హెచ్ఐవీ పాజిటీవ్, హెపటైటిస్ బి, సి సోకినట్లు తేలింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. దీనిపై విప‌క్షాలు భ‌గ్గుమ‌న్నాయి… డబుల్ ఇంజిన్ సర్కార్ లో అనారోగ్యాలు కూడా డబుల్ అవుతున్నాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ప్రభుత్వ తప్పునకు పిల్లలు శిక్ష అనుభవిస్తున్నారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement