ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో మూడో త్రైమాసిక ఆర్ధిక ఫలితాలను వెల్లడించింది. డిసెంబర్‌తో ముగిసిన ఈ క్వార్టర్‌లో కంపెనీకి 2.8 శాతం నికర లాభం పెరిగింది. సంస్థ నికర లాభం 3,053 కోట్లుగా ఉంది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం 2,969 కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో విప్రో ఆదాయం 14.3 శబుూతం పెరిగి 23,229 కోట్లుగా ఉంది. ఈ ఆర్ధిక సంవత్సరం మొత్తంలో ఐటీ సర్వీసెస్ బిజినెస్ నుంచి ఆదాయం 115.-12 శాతం వరకు ఉంటుందని అంచనా వేసింది. 2023 మార్చి 31తో ముగిసే ఆర్ధిక సంవత్సరంలో ఇది 0.6-1 శాతం వరకు వృద్ధికి తోడ్పతుందని తెలిపింది. ఈ త్రైమాసికంలో మొత్తం బుకింగ్స్ 4.3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని విప్రో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్టే చెప్పారు.
ఈ కాలంలో విప్రో మార్కెట్ వాటా పెరిగిందని, క్లైయింట్స్‌తో సంబంధాలు మరింత మెరుగపడ్డాయని చెప్పారు. విప్రో ప్రతి షేరుకు 1 రూపాయి మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. కంపెనీలో ఉద్యోగుల సంఖ్య గత తైమాసికంతో పోల్చితే తగ్గింది. ప్రస్తుతం విప్రోలో 2,58,744 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. గత త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 2,59,179 మంది ఉన్నారు. ఉద్యోగాలు మానేస్తున్నవారి సంఖ్య 23 శాతం నుంచి 21.2 శాతానికి తగ్గింది. వార్షిక ప్రాతిపదికన ఉద్యోగాలు మానేస్తున్నవారు 22.7 శాతంగా ఉన్నారు.