యునికార్న్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ.. డిజిట్ ఇన్సూరెన్స్ రూ.137 కోట్ల క్లెయిమ్‌ను సెటిల్ చేసినట్టు వెల్లడించింది. భారతదేశంలో సుప్రసిద్ధ రసాయనాల తయారీ కంపెనీలో ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంతో జరిగిన నష్టానికి ఈ బీమా పరిహారాన్ని అందించారు. గుజరాత్‌లోని ఆ కంపెనీలో జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన క్లెయిమ్‌ను కేవలం 9 నెలల్లోనే సెటిల్ చేసినట్టు కంపెనీ వెల్లడించింది. ఈ ప్రమాదం ఫిబ్రవరి 23న జరిగింది. భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం సంభవించింది. డిజిట్ ఇన్సూరెన్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వివేక్ చతుర్వేది మాట్లాడుతూ.. 22 రోజుల్లోనే రూ.25 కోట్లు కంపెనీకి అందించాం. మరో రూ.20 కోట్లను జూన్ 14న అందజేశాం. క్లెయిమ్స్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా ఓ బృందాన్ని నియమించాం. మిగిలిన రూ.92 కోట్లను నవంబర్ 30న డిజిట్ ఇన్సూరెన్స్ విడుదల చేసింది. బీమా సంస్థగా.. నష్టాలను వీలైనంతగా తగ్గించేందుకు క్లెయిమ్‌ను త్వరగా చేయాలని కోరుకుంటాం. బీమా సంస్థగా సానుభూతి చూపాల్సిన ఆవశ్యకత ఉంది.
మా బృందం స్పందించిన తీరు కారణంగానే.. క్లెయిమ్‌ను సానుకూలంగా సెటిల్ చేయడంజరిగింది. ఫైర్ ఇన్సూరెన్స్ కోసం 99.5 శాతం క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియోను 2022 రెండో త్రైమాసికంలో డిజిట్ కలిగి ఉంది. డిజిట్‌తో భాగస్వామ్యం చేసుకోవడంతో సంతోషంగా ఉన్నామని, ఈ కష్ట కాలంలో ఈ బృందం మాకు అండగా నిలబడిందని పరిహారం అందుకున్న సంస్థ తెలిపింది. క్లెయిమ్ త్వరగా సెటిల్ చేశారని వివరించింది. తమ కార్యకలాపాలు మళ్లి ప్రారంభించేందుకు క్లెయిమ్ డబ్బులు ఎంతో ఉపయోగపడుతాయని వివరించింది. ఈ సంస్థ డిజిట్ ఇండస్ట్రియల్ మెగా రిస్క్ ఇన్సూరెన్స్‌పాలసీని జులై 2020లో తీసుకుంది. బెంగళూరు ప్రధాన కార్యాలయం నుంచి సేవలు అందిస్తుంది. విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital