దిగ్గజ కార్ల తయారీ సంస్థ కియా సరికొత్త మోడల్ సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌కు భారీ డిమాండ్ కనిపిస్తోంది. బుకింగ్స్ ప్రారంభించిన 24 గంటల వ్యవధిలోనే 13400కిపైగా ఆర్డర్లు లభించాయి. ఆధునికీరరించబడిన మధ్య తరహా ఎస్‌యూవీకి శుక్రవారం నుంచి బుకింగ్స్ మొదలయ్యాయి. శనివారం సాయంత్రానికి దేశవ్యాప్తంగా ఉన్న (ఆన్‌లైన్ సహా) అధీకృత కియా డీలర్‌షిప్‌ల వద్ద 25000 ప్రీ బుకింగ్స్ ఆర్డర్లు లభించినట్లు తెలుస్తోంది. కె-కోడ్ బుకింగ్స్ 1973 జరిగాయని సదరు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ ఏడాది కియా మొత్తం విక్రయాలలో సెల్టోస్ 50శాతం వాటాను ఆక్రమిస్తుందని అంచనా వేస్తున్నట్లు కియా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ తే జిన్ పార్క్ అన్నారు. ఫ్రంట్ ఫాసియా రీడిజైన్ చేయబడిన గ్రిల్ సెక్షన్, పొడిగించిన ఎల్‌ఈడీ డైటైమ్ రన్నింగ్ లైట్‌లతో కూడిన షార్పర్ ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్‌లు, విస్తృత ఎయిర్ ఇన్‌లెట్‌తో అప్‌డేట్ చేయబడిన బంపర్‌తో సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ మార్కెట్‌లోకి వస్తుందని చెప్పారు. 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, ట్వీక్ చేయబడిన టెయిల్‌గేట్, లైట్‌బార్ ద్వారా కనెక్ట్ చేయబడిన కొత్త ఇన్వర్టెడ్ ఎల్ నమూనా ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్‌లు మరింత ఆకర్షణీయంగా ఉంటాయని తెలిపారు.
ఇంటీరియర్‌లో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ క్లస్టర్, ఎనిమిది అంగుళాల హెచ్‌యుడి పనోరమిక్ సన్‌రూప్, స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమేరా సిస్టమ్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లయిమేట్ కంట్రోల్, అప్‌డేట్ చేయబడిన హెచ్‌విఎసి వంటి కర్వ్ డిస్‌ప్లే వస్తుందని చెప్పారు. 2023 కియా సెల్టోస్ ధరలు ఈ నెలాఖరులో వెల్లడవుతాయని అన్నారు.