Monday, November 25, 2024

ఏపీలో ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.134 కోట్లు.. ఎంపీ బీద ప్రశ్నలకు కేంద్ర షిప్పింగ్ మంత్రి జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాజెక్టుల అభివృద్ధికి కేటాయించిన నిధులపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఓడరేవులు, జలమార్గాల ప్రాజెక్టుల వివరాలు, పూర్తయ్యే కాలపరిమితి, మంజూరైన నిధులు, ఖర్చు చేసిన మొత్తం తదితర అంశాలపై వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బీద మస్తాన్‌రావు మంగళవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖా మత్రి సర్బానంద సోనోవాల్ సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 ప్రాజెక్టులకు సాగరమాల ద్వారా రూ. 1533 కోట్ల నిధులను కొంతమేర సమకూర్చినట్టు తెలిపారు.

13 ప్రాజెక్టులలో ఐదు ప్రాజెక్టులు రూ.754 కోట్లతో పూర్తయ్యాయని, మూడు ప్రాజెక్టులు రూ 316 కోట్లతో పనులు జరుగుతున్నాయని, రూ.463 కోట్లతో 5 ప్రాజెక్టుల అభివృద్ధి జరుగుతోందని కేంద్రమంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.134.48 కోట్ల నిధులు మంజూరు చేసినట్టు ఆయన వివరించారు. నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నెలోని ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి కోసం రూ. 288 కోట్ల బడ్జెట్‌ కేటాయించినట్టు కేంద్రమంత్రి జవాబిచ్చారు. ప్రస్తుతం 36.10 కోట్లు మంజూరయ్యాయని, ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని సర్బానంద సోనోవాల్ చెప్పుకొచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement