Wednesday, November 20, 2024

దేశంలో కొత్తగా 1300 కొవిడ్‌ కేసులు..

దేశంలో కరోనా వైరస్‌ కేసులు మళ్లిd పెరుగుతున్నాయి.గత ఐదు రోజులుగా సగటున వెయ్యేసి కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 89,078 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 1,300 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం 140 రోజుల తర్వాత ఇదే మొదటిసారి. తాజా కేసులతో దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడినవారి సంఖ్య 4,46,99, 418కి చేరింది. ప్రస్తుతం దేశంలో 7,605 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

గత 24 గంటల్లో కర్ణాటక , గుజరాత్‌ , మహారాష్ట్ర లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ముగ్గురు మరణించారు. తాజా మరణాలతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 5,30,816కి చేరింది. ఇక కరోనా మ#హమ్మారి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 4,41,60,997 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 0.02 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రికవరీ రేటు 98.79 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.65 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement