రష్యాల్లో బంగారు గని కుప్పకూలింది. తూర్పు సైబీరియాలోని అముర్ ప్రాంతంలో గల జైస్క్ జిల్లాలోని పయనీర్ మైన్ ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది కార్మికులు చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు.అయితే 15 మంది వరకూ కార్మికులు భూగర్భంలో ఉండొచ్చని ప్రాంతీయ ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది.
వారంతా దాదాపు 410 అడుగుల లోతున చిక్కుకుపోయినట్లు తెలిపింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. కాగా, రష్యాలో అతిపెద్ద గోల్డ్ మైనింగ్ కార్యకలాపాల్లో పయనీర్ మైన్ ఒకటి అని రాయిటర్స్ నివేదించింది. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.