సాంకేతిక, భద్రతా వంటి పలు కారణాలతో 2021-22 సంవత్సరంలో వివిధ కంపెనీలు 13 లక్షల వాహనాలను వెనక్కి పిలిపించాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సొసౖౖెటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫాక్చరర్స్ గణాంకాల ప్రకారం వివిధ భద్రతాపరమైన లోపాల కారణంగా 2021-22 సంవత్సరంలో 8,64,557 ద్విచక్ర వాహనాలను, 4,67,311 ప్యాసెంజర్ కార్లను రీకాల్ చేసినట్లు లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగన ప్రశ్నకు బదులిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం నాడు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై 15 నాటికి 1,60,025 ద్విచక్ర వాహనాలను, 25,142 ప్యాసెంజర్ కార్లను రీకాల్ చేసినట్లు వెల్లడించారు. 2020-21లో 3.39 లోల, 2019-20 సంవత్తసరంలో 2.14 లక్షల కార్లను రీకాల్ చేసినట్లు తెలిపారు. మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారం భద్రతా లోపాలు గుర్తిస్తే అలాంటి వాహనాలను రీకాల్‌కు ఆదేశించే అధికారం ప్రభుత్వానికి గడ్కరీ తెలిపారు. జాతీయ రహదారులపై ప్రమదాల కారనంగా 47,984 మంది, రాష్ట్ర రహదారులపై ప్రమాదాల వల్ల 33,148 మంది చనిపోయినట్లు మంత్రి వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.