Tuesday, November 26, 2024

Big Story | గడ్డెన్నవాగుకు కాళేశ్వరం జలాలు.. ప్రాజెక్టు పునరుద్ధరణకు 13.57కోట్లకు ఆమోదం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రానికి జీవధారైన కాళేశ్వరం ఎత్తిపోతలప్రాజెక్టులో అంతర్భాగంగా గడ్డెన్న వాగును చేర్చి నీటిని నింపేందుకు సాగునీటి శాఖ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించి నిధులను కేటాయించింది. ఆ ప్రాజెక్టు నుంచి మిషన్‌ భగరథకు 0.55 టీఎంసీ నీటిని కేటాయించి తాగునీటి పథకాన్నిమరింత విస్తృత పర్చేందుకు ఈ ప్రాజెక్టు పునరుద్ధరణ పనులను ప్రభుత్వం ప్రారంభించింది.

ఇక ప్రాజెక్టు వివరాల్లోకి వెళ్లితే గడ్డెన్న వాగు ప్రాజెక్టు నిర్మల్‌ జిల్లాలోని భైంసా సమీపంలో సుద్ధవాగు పై 14వేల ఎకరాల ఆయకట్టుకు నీటి సౌకర్యం కల్పించేందుకు నిర్మించారు. ఈప్రాజెక్టును తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఎఫ్‌.ఆర్‌.ఎల్‌ వరకు నీటితో నింపారు. ప్రాజెక్టు నిర్మాణంలో బాధితులైన వారికి రూ. 20కోట్లను ప్రభుత్వం చెల్లించింది. ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ సిమెంట్‌ లైనింగ్‌ పనులు రూ. 21కోట్ల 37 లక్షల తో చేపట్టి నీటిపారుదల శాఖ పనులను పూర్తి చేసింది.

- Advertisement -

అయితే ప్రాజెక్టు లక్ష్యం పూర్తిగా నెరవేరకపోవడంతో మరమ్మత్తులు చేపట్టి నిర్మాణం పూర్తి చేశారు. అయితే ముథోల్‌ నియోజక వర్గం తాగునీటి అవసరరాల కోసం భగీరథ కింద 0.55 టీఎంసీ నీటిని కేటాయించడంతో 14వేల ఆయకట్టుకు బదులుగా కేవలం 6వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. తిరిగి పునరుద్ధరించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు లోని 28వ ప్యాకేజీ ద్వారా ఈ ప్రాజెక్టు ఆనకట్టకు నిరంతరం నీటిని నింపాలని సాగునీటిపారుదల శాఖ ప్రతిపాధించి పనులు ప్రారంభించింది.

ప్రతిపాద పనులకోసం రూ.13కోట్ల 57 లక్షల అంచెనావ్యయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదిత పనులను జూలై లోగా పూర్తి చేసి ప్రతిపాదిత 14వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటుగా మిషన్‌ భగీరథకు నిరంతరం 0.55 టీఎంసీ నీటిని అందుబాటులో ఉంచేందుకు అవకాశం లభించింది. ఎక్కడ నీటి కొరత ఉన్నా కాళేశ్వరం ద్వారా పరిష్కరించే అవకాశాలుండటంతో ఇది సాధ్యమవుతోందని జలనిపుణులు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement