Friday, November 22, 2024

డబ్ల్యూటీసీ విజేతకు రూ.13.22 కోట్లు

వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ 2021-23 ప్రైజ్‌మనీపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసిసి) అధికారిక ప్రకటన చేసింది. మొత్తం రూ. 31.4 కోట్లను 9 జట్లకు పంచనున్నట్లు తెలిపింది. 2019-21 టెస్ట్‌ చాంపియన్‌షిప్‌కు కూడా ఇంతే ప్రైజ్‌మనీ ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్‌ 7 నుంచి 11 వరకు ఐసీసీ ఐసీసీ వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరగనుంది. ఓవల్‌ వేదికగా ఆస్ట్రేలియా, భారత్‌ జట్లు తలపడనున్నాయి.

ఫైనల్‌లో విజేతగా నిలిచిన జట్టుకు 1.6 మిలియన్‌ డాలర్లు (రూ.13.22 కోట్లు), రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 8 లక్షల డాలర్లు (రూ.6.5 కోట్లు)ఇవ్వనున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. 2023 డబ్ల్యూటీసీ లిస్టింగ్‌లో మూడవ స్థానంలో ఉన్న సౌతాఫ్రికాకు 3.72 కోట్లు, నాల్గవ స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌కు 2.9 కోట్ల ప్రైజ్‌మనీ అందుతుంది. శ్రీలంక (5వస్థానం)కు 1.65 కోట్లు, న్యూజిలాండ్‌ (6), పాకిస్థాన్‌ (7), వెస్టిండీస్‌ (8), బంగ్లాదేశ్‌ (9) జట్లకు ఒక్కొక్కరికి 82 లక్షలు ప్రైజ్‌మనీగా లభిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement